"ఋషిపీఠ౦- చారిటబులు ట్రస్ట్"
" ఋషిపీఠ౦" "ఋషిపీఠ౦- చారిటబులు ట్రస్ట్" మన భారతీయ సనాతన ఆర్షధర్మ పరిరక్షణలో తన వంతు కృషి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సనాతన ధర్మ వేదిక. దీనికి అధిపతి ఆ పరమేశ్వరుడే. ఆయన కృపతో పుట్టిన ఈ వైదిక సంపదను ఆయన క్రుపతోనే పరిరక్షించే భాద్యతను స్వీకరిస్తూ, ఈ క్రమంలో తమ వంతు కృషి చేస్తున్న వేద పండితులను, కర్మయోగులను, సాహితివేత్తలను గౌరవించి శక్తి కొలది వారికి ఆయా రంగాలలో తనవంతు తోడ్పాటు అందించే సర్వోత్కృష్టమైన ఒక వేదిక " ఋషిపీఠ౦".
చిత్తసుద్ధి ,సత్సంకల్పం దీక్షా బద్ధమైన కృషి కలిగిన మహాశయుల తోడ్పాటుతో ఋషిపీఠం వేదికగా చేపట్టిన ధార్మిక పరిరక్షణా కార్యక్రమములలో, నిబద్ధత కలిగిన ధార్మిక విలువలతో దీక్ష వహిస్తున్న ఈ "ఋషిపీఠం- "చారిటబులు ట్రస్ట్" " లో భారతీయ ధర్మాభిమానులందరు భాగస్వాములే .
భారతీయత, భారత సమాజం అంటే మనకు స్పురణకు, మన కంటికి కనిపించే దృశ్యం - వేదగోష, ఋషులు, తపోవాటికలు, మన దేవాలయాలు, శిల్పసంపద, సంప్రదాయాలు, మన పూర్వికుల ధర్మనిరతి. ఇది ఒకనాటి భారతీయ జీవన విధానం, కనుమరుగైన అధ్బుత ప్రపంచం. ఈ అనుభూతిని ఆస్వాదించే అర్హత ఈ గడ్డలో పుట్టిన ప్రతి భారతీయునిది.Read more...
సంగీత ,సాహిత్య ,నాట్య ,నాటక ఇత్యాది కళా రూపాలను విభిన్నంగా అందజేస్తూ ,తద్వారా వా...
సనాతన ధర్మానికి పట్టు కొమ్మలైన భారతీయ విద్యలలో నిష్ణాతులైన వారిని గౌరవించడం ,...


